ఆంధ్రప్రదేశ్‌ అంధకారం కాబోతోంది

ABN , First Publish Date - 2021-10-19T05:03:44+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ అంధకారం కాబోతుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ అంధకారం కాబోతోంది
మాట్లాడుతున్న బత్యాల చెంగల్రాయులు

 టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయులు

నందలూరు, అక్టోబరు18 : ఆంధ్రప్రదేశ్‌ అంధకారం కాబోతుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు అన్నారు. సోమవారం నందలూరు మండలంలోని పొత్తపి గ్రామంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ చార్జీల పెంపు విషయంపై మొదటి రోజు సుడిగాలి పర్యటన చేస్తూ వైసీపీ ప్రభుత్వ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పథకాలతో పాటు దశ పథకం జగనన్న చీకటి పథకం ప్రవేశ పెట్టారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బొగ్గు కొరత వల్ల విద్యుత్‌ సంక్షోభం ఏర్పడింది. దానిని కప్పి పుచ్చుకోవడం కోసం మిగిలిన రాష్ట్రాల్లో వేరు, మన రాష్ట్రంలో పరిస్థితి వేరంటున్నారన్నారు.  కేవలం జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపు కొరవడటం వల్ల నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అంధకారంలోకి వెళ్లబోతోందని విమర్శించారు.  రెండు నెలలుగా వసూలు చేసిన ట్రూఅప్‌ చార్జీలను వినియోగదారులకు తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌బాబు యాదవ్‌, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్‌, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి కడవకూడ తిరుపతయ్య, రాజంపేట పార్లమెంట్‌ అధికార ప్రతినిధి అద్దేపల్లె ప్రతా్‌పరాజు, పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి కోవూరు సుబ్రహ్మణ్యంనాయుడు, జంగంశెట్టి సుబ్బయ్య, మాజీ ఏఎంసీ ఉప చైర్మన్‌ తాటి సుబ్బరాయుడు, పసుపులేటి ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T05:03:44+05:30 IST