Abn logo
Sep 27 2021 @ 02:56AM

కేంద్రం ఇవ్వగానే హాంఫట్‌.. వద్దని ముందే చెప్పినా రూ.285 కోట్లు సొంతానికి వాడేసుకున్న AP సర్కార్

కేంద్ర నిధులు హైజాక్‌

రహదారుల కోసం ఇచ్చిన 285 కోట్లు సొంతానికి వాడేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

కేంద్ర రహదారి మంత్రిత్వశాఖలో హాట్‌ టాపిక్‌


(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రహదారుల అభివృద్ధి, మరమ్మత్తుల కోసం కేంద్రం నుంచి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం హైజాక్‌ చేసేసింది. కేంద్ర రహదారి మౌలిక సదుపాయాల నిధి (సీఆర్‌ఐఎఫ్‌) కింద వచ్చిన రూ.285 కోట్లను సొంత అవసరాలకు వాడేసుకుంది. తామిచ్చే నిధులను ఇతర అవసరాలకు వినియోగించకూడదని కేంద్రం స్పష్టంగా చెప్పినప్పటికీ రాష్ట్ర సర్కారు వాటిని కాజేసింది. ఈ నిధులను రహదారులు, దెబ్బతిన్న వంతెనలు, బ్రిడ్జిలు, ఇంకా ఇతర రహదారి మౌలిక సదుపాయాల కోసం ఖర్చుచేయాలి. కానీ సర్కారు ఆర్‌అండ్‌బీకి రూపాయి కూడా ఇవ్వకుండానే ఇతర అవసరాలకు మళ్లించుకుంది. రహదారుల మరమ్మతుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న రోడ్లు భవనాల శాఖకు మొండిచేయి చూపించింది. కేంద్ర రహదారి మంత్రిత్వ శాఖలో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌గా మారింది. స్టేట్‌ హైవేలు, వాటిపై భారీ వంతెనల అభివృద్ధి, విస్తరణ, మరమ్మతులతోపాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకోసం కేంద్రం సీఆర్‌ఐఎఫ్‌ నుంచి ఏటా నిధులు ఇస్తుంది.


పెట్రోల్‌, డీజీల్‌పై కేంద్రం వసూలు చేసే సెస్సు నుంచే సీఆర్‌ఐఎ్‌ఫకు సొమ్ములు వెళ్తాయి. ఒక్కో ఆర్థిక సంవత్సరంలో ఏ మేరకు నిధులు కేటాయించాలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ముందుగానే నివేదిక ఇస్తుంది. 2021 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి కనీసం రూ. 500 కోట్లు కేటాయించాలని తొలుత ప్రతిపాదించా రు. కేంద్రం రూ.334 కోట్లకు అంగీకారం తెలిపింది. ప్రతిపాదనలను కేంద్ర రోడ్డురవాణా శాఖ పరిశీలిం చి ఖరారు చేస్తుంది. నిధులను మాత్రం కేంద్ర ఆర్థికశాఖ ద్వారానే విడుదల చేస్తారు. 2021 ఆర్థిక సంవత్సరానికి ఏపీకి రూ.221 కోట్లు మాత్రమే ఇస్తామని ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఎంఓఆర్‌టీహెచ్‌ అండర్‌ సెక్రెటరీ ఎస్‌.కె.మక్కర్‌ తెలియజేశారు. అధికారులు వెళ్లి చర్చించిన తర్వాత ఆ పద్దును రూ.334 కోట్లకు పెంచుతూ జూన్‌ 9న మరో లేఖ రాశారు. ఇందులో తొలి విడతగా ఈ ఏడాది జూలై 19న రూ.285.02 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ నిధులను వెంటనే రాష్ట్ర ఆర్‌అండ్‌బీలోని సీఆర్‌ఐఎఫ్‌ విభాగం ఖాతాకు పంపించాలి. ఈ నిధులు వస్తే రహదారుల అభివృద్ధి, కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించవచ్చు. అయితే, రెండు నెలలు గడిచినా నిధులు జమకాలేదు. కేంద్రం నుంచి నిధులు రాగానే దారి మళ్లించినట్లు తెలుస్తోంది. 


కేంద్రం ఇవ్వగానే హాంఫట్‌..

కేంద్రం ఈ నిధులు విడుదల చేసి రెండు నెలలు దాటిపోయిం ది. ఆర్‌అండ్‌బీలోని సీఆర్‌ఐఎఫ్‌ పద్దుకు ఈ నిధులు ఇంకా జమచేయలేదని తెలిసింది. ఇదే విషయాన్ని అధికారులు ప్రస్తావించగా ప్రభుత్వం చూసుకుంటుంది. మీకు నిధులొస్తాయి్‌్‌ అని బదులిచ్చినట్లు తెలిసింది. నిజానికి సీఆర్‌ఐఎఫ్‌ పద్దులో కాంట్రాక్టర్లకు రూ.150 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. మరో రూ.120 కోట్లు పాత బకాయిలున్నాయి. ఈ ఏడా ది కేంద్రం ఇచ్చే నిధులను పూర్తి గా కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు సరిపోవని అంచనావేశారు. అయి తే, చట్టబద్దంగా రావాల్సిన నిధు లు కూడా అందకపోవడంతో బిల్లుల చెల్లింపుపై డైలామా నెలకొంది. అయితే, మధ్యలో రూ.100 కోట్లు ఇస్తున్నట్లుగా ప్రభుత్వం జీఓలు ఇచ్చింది. మరోసారి రూ. 150 కోట్లు విడుదల చేస్తున్నట్లు మరో జీఓ ఇచ్చింది. ఈ నిధులతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించవచ్చని పేర్కొంది. అయితే, కేంద్రం కేటాయించిన రూ.334 కోట్ల నిధు ల్లో రాష్ట్రానికి రూ.285 కోట్లు వచ్చాయి. కాగా.. తామిచ్చిన నిధులను ఆర్‌అండ్‌బీకి జమచేయలేదన్న విషయం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు తెలిసింది. నిధుల మళ్లింపు అంశంపై ఎంఓఆర్‌టీహెచ్‌లోని ప్రిన్సిపల్‌ సీసీఏకు లేఖరాసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే, రూ.285 కోట్ల రోడ్ల నిధులను ప్రభుత్వం ఎటు దారిమళ్లించింది? ఎక్కడ ఖర్చుపెట్టిందన్న విషయంపై స్పష్టత లేదు.  


వాడొద్దని చెప్పినా..

సీఆర్‌ఐఎఫ్‌ నిధులను ఏపీకి విడుదల చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా శాఖ నుంచి 9 రకాల సూచన లు, సలహాలు ఇచ్చింది. ఈ నిధులను కేంద్రం ఆమోదించిన నిర్దేశిత ప్రాజెక్టులకు, ఇప్పటికే సీఆర్‌ఐఎఫ్‌ పద్దులో కొనసాగుతున్న పనులకు మాత్రమే వినియోగించాలని చెప్పింది. బిల్లుల చెల్లింపుపై వినియో గ ధృవపత్రాలు, దీంతోపాటు చేపట్టిన వర్క్‌ల పురోగతిపై త్రైమాసిక నివేదికలు ఇవ్వాలని కేంద్రం కోరిం ది. నిధుల వినియోగంపై నెలవారీగా స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని ప్రత్యేక ప్రొఫార్మాను పంపించింది. నిధుల వినియోగంపై ఎంఓఆర్‌టీహెచ్‌లోని ప్రిన్సిపల్‌ సీసీఏ కార్యాలయం రాష్ట్రానికి దిశానిర్దేశం చేయాలని కోరింది.