జగన్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదా?

ABN , First Publish Date - 2020-06-05T01:07:05+05:30 IST

అధికార వైసీపీలో తిరుగుబాటు స్వరాలు. సీనియర్లలో తీవ్ర అసంతృప్తి. జూనియర్లలో కనిపించని ఫ్రస్ట్రేషన్‌. ఎమ్మెల్యేలను డోంట్ కేర్ అంటున్న...

జగన్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదా?

అధికార వైసీపీలో తిరుగుబాటు స్వరాలు. సీనియర్లలో తీవ్ర అసంతృప్తి. జూనియర్లలో కనిపించని ఫ్రస్ట్రేషన్‌. ఎమ్మెల్యేలను డోంట్ కేర్ అంటున్న అధికారులు. జగన్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ నిస్పృహ. అనే అంశాలపై ‘ఇంటిపోరు’ పేరుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్‌లో కాంగ్రెస్‌ నేత వింత సంజీవరెడ్డి, టీడీపీ నేత యరపతినేని, బీజేపీ నేత రామకోటయ్య పాల్గొన్నారు. 


కాంగ్రెస్‌ నేత వింత సంజీవరెడ్డి మాట్లాడుతూ ‘‘ఆరునెలల్లోనే మంచి సీఎంని అన్పించుకుంటానని జగన్‌ అన్నారు. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం ఉందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏపీలో రాజకీయ నేతలు చెప్పినట్టు అధికారులు వినడంలేదు. రాజకీయ నేతలు, అధికారులు రాష్ట్రాన్ని దోచుకోవడంపైనే దృష్టిపెట్టారు. కాంగ్రెస్‌, టీడీపీ హయాంలో దుర్మార్గపు పాలన కన్పించలేదు. కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా జగన్‌ మొండిగా ముందుకెళ్తున్నారు. వైసీపీ ప్రభుత్వం దోచుకోవడమే ఎజెండాగా పెట్టుకుంది.’’ అని అన్నారు. 


టీడీపీ నేత యరపతినేని మాట్లాడుతూ ‘‘ వైసీపీ నేతలు చేసే తప్పుడు పనులకు అధికారులు వంత పాడుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు చేసే అక్రమాలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. సుమారు 80 వైసీపీ ఎమ్మెల్యేలకు ఇంతవరకు సీఎం జగన్‌ను కలవలేదు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో అసహనం మొదలైంది. రాష్ట్రంలో అవినీతి కార్యక్రమాలు జోరుగా నడుస్తున్నాయి.’’ అని మండిపడ్డారు. 


బీజేపీ నేత రామకోటయ్య మాట్లాడుతూ ‘‘సీనియర్‌ ఎమ్మెల్యేలందరినీ జగన్‌ పక్కనపెట్టారు. ఏపీలో ఆరుగురు వ్యక్తులు 13మంది కలెక్టర్లను నియంత్రిస్తున్నారు. ఏపీలో ఎమ్మెల్యేలకు అధికారులు గౌరవం ఇవ్వడంలేదు.’’ అని చెప్పారు. 

Updated Date - 2020-06-05T01:07:05+05:30 IST