భారత జట్టులో ఆంధ్రా ఆటగాళ్లకు చోటుపైనే దృష్టి

ABN , First Publish Date - 2020-02-20T09:29:00+05:30 IST

రాష్ట్రం నుంచి భారత క్రికెట్‌ జట్టులో కనీసం ముగ్గురు నుంచి ఐదుగురికి చో టు దక్కేలా చేయడంపైనే ప్రత్యేక దృష్టి సారించామని ఆంధ్రా క్రికెట్‌ సంఘం ఆపరేషన్స్‌ డైరెక్టర్‌, భారత మాజీ ఆటగాడు వేణుగోపాల్‌రావు తెలిపారు.

భారత జట్టులో ఆంధ్రా ఆటగాళ్లకు చోటుపైనే దృష్టి

ఆంధ్రా క్రికెట్‌ సంఘం ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ వేణుగోపాల్‌రావు


అనంతపురం క్లాక్‌టవర్‌, ఫిబ్రవరి 19 : రాష్ట్రం నుంచి భారత క్రికెట్‌ జట్టులో కనీసం ముగ్గురు నుంచి ఐదుగురికి చో టు దక్కేలా చేయడంపైనే ప్రత్యేక దృష్టి సారించామని ఆంధ్రా క్రికెట్‌ సంఘం ఆపరేషన్స్‌ డైరెక్టర్‌, భారత మాజీ ఆటగాడు వేణుగోపాల్‌రావు తెలిపారు. బు ధవారం స్థానిక ఆర్డీటీ స్టేడియంలోని ఆడిటోరియంలో రా యలసీమ జిల్లాల క్రికెట్‌ కోచ్‌లు, అంపైర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వే ణుగోపాల్‌రావు మాట్లాడుతూ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, వసతులు కల్పించడానికి బీసీసీఐ సూచనల మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రంజీ, ఐపీఎల్‌, ఇండియా ఏ టీంతో పాటు జాతీయ స్థాయి క్రికెట్‌ జట్టుకు, ఇతర దేశా లలో ని ర్వహించే క్రికెట్‌ పోటీలకు రాష్ట్రం నుంచి అధిక మంది క్రీడాకారులు వెళ్లేలా తీర్చిదిద్దుతామన్నారు.  ఇప్పటికే ఇండియా లెవెల్‌లో టాప్‌లో రాష్ట్రం నుంచి క్రీడా కారులు ఉన్నారన్నారు. అంతకు ముందు ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంచో ఫెర్రర్‌ను కలిసి  జిల్లాలో క్రికెట్‌ అభివృద్ధికి తీసుకోవాల్సిన ప్రణాళికలపై చర్చించారు.  కార్యక్రమంలో జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పగడాల మల్లికార్జున, మధు, సీనియర్‌ క్రీడాకారులు సురేష్‌, మధు, రవికాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T09:29:00+05:30 IST