ఆంధ్ర ఎంపీలు ప్రస్తావిస్తే మద్దతిస్తాం

ABN , First Publish Date - 2020-09-23T07:38:57+05:30 IST

నవ్యాంధ్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న ప్రధాన డిమాండ్‌తో తాము చేపట్టిన ధర్మపోరాటానికి అమరావతి మహిళా జేఏసీ నేతలు ఢిల్లీలో మద్దతు కూ డగట్టే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మం గళవారం కూడా వివిధ

ఆంధ్ర ఎంపీలు ప్రస్తావిస్తే మద్దతిస్తాం

శివసేన ఎంపీ అరవింద్‌ సావంత్‌


న్యూఢిల్లీ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న ప్రధాన డిమాండ్‌తో తాము చేపట్టిన ధర్మపోరాటానికి అమరావతి మహిళా జేఏసీ నేతలు ఢిల్లీలో మద్దతు కూ డగట్టే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మం గళవారం కూడా  వివిధ పార్టీల నేతలు, ఎం పీలను కలిశారు. శివసేన ఎంపీ, కేంద్ర మా జీ మంత్రి అరవింద్‌ సావంత్‌తోనూ సమావేశమై వినతి పత్రం సమర్పించారు. తమ పోరాటానికి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేయగా ఆయన సంఘీభా వం తెలిపారు. ఈ సందర్భంగా మహిళా రైతుల తో మాట్లాడారు. 


రాజధాని అమరావతి అంశాన్ని పార్లమెంటులో ఆంధ్ర ఎంపీలు ప్రస్తావిస్తే.. కచ్చితంగా తమ పార్టీ తరఫున మద్దతిస్తామన్నారు.  గతంలో టీడీపీ ఎంపీలు రాష్ట్ర విభజన హామీలపై ఎప్పుడు మాట్లాడినా తమ పార్టీ మద్దతిచ్చిందని గుర్తుచేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని, భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. జగన్‌ ప్రభుత్వం కూడా మూడు రాజధానుల నిర్ణయంపై పునరాలోచించాలని.. దీనిని రాజకీయం చేయకుండా వ్యవహరించాలని సూచించారు.


రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌ కె.సురేశ్‌ను జేఏసీ నేత లు కలిశారు.  తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ సౌగతా రాయ్‌ను కూడా మహిళా జేఏసీ నేత లు కలిశారు. ఆయన  కూ డా మద్దతు తెలియజేశారు. ఆయా నేతలతో సమావేశమైన మహిళా జేఏసీ నేతల్లో సుంకర పద్మశ్రీ, అక్కినేని వనజ, తంగిరాల సౌమ్య, రాయపాటి శైలజ, కంభంపాటి శిరీష, మువ్వ, సుజాత, గుర్రం ప్రియాంక ఉన్నారు. 


రాజధాని మారదు: శాస్త్రి

అమరావతి పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షుడు జీవీఆర్‌ శాస్త్రిని కూడా మహిళా రైతు ప్రతినిధులు కలిశారు. తమ పోరాటానికి సంపూర్ణంగా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానులను మార్చుకుంటూ పోతే ఎలా? కచ్చితంగా రాష్ట్ర ప్రజలకు, భూములిచ్చిన రైతులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం నా కుంది. రాజధానిగా అమరావతినే కొనసాగించేదా కా రాజీ లేని పోరాటం చేద్దాం’ అని చెప్పారు.


Updated Date - 2020-09-23T07:38:57+05:30 IST