హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షి్‌పలో ఆంధ్రప్రదేశ్ జట్టుకు నిరాశ ఎదురైంది. శుక్రవారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణతో జరిగిన ప్రీక్వార్టర్స్ పోరులో ఆంధ్ర 8-24తో ఓటమి పాలైంది. శుక్రవారం సాయంత్రమే జరిగిన రెండో క్వార్టర్స్‌లో తెలంగాణ 27-22తో రాజస్థాన్‌పై గెలిచింది. హిమాచల్‌ప్రదేశ్ 28-7తో పశ్చిమ బెంగాల్‌పై గెలిచి సెమీస్ బెర్త్ దక్కించుకుంది.