అమరావతి: సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల ఆంధ్రాగా మారిందని టీడీపీ అధినేత Chandrababu ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడేళ్లు గడుస్తున్నా ఏపీలో ఒక్క కొత్త పరిశ్రమ రాలేదని విమర్శించారు. గంజాయి, Drugsకు ఏపీని అడ్డాగా మార్చారని దుయ్యబట్టారు. ఏపీలో లాటరైట్ గనులను అక్రమంగా భారతీ సిమెంట్స్‌కు జగన్‌రెడ్డి దోచిపెడుతున్నారని ఆరోపించారు. పేదల ఇంటి నిర్మాణానికి అందుబాటులో లేకుండా సిమెంట్ ధరలు పెరిగిపోయాయని తెలిపారు. ‘‘జగన్‌కు సవాల్ చేస్తున్నాం. టీడీపీ, వైసీపీ సంక్షేమంపై చర్చకు మేం సిద్ధం. మా సవాల్‌కు జగన్‌రెడ్డి సిద్ధమా’’ అని చంద్రబాబు సవాల్ విసిరారు.
ఇవి కూడా చదవండి