ఆంధ్రా బ్యాంక్‌ విశ్రాంత ఉద్యోగుల సమావేశం

ABN , First Publish Date - 2022-08-15T10:08:39+05:30 IST

ఆంధ్రాబ్యాంక్‌ విశ్రాంత ఉద్యోగులు సర్వీస్‌లో ఉన్న కాలంలో చేసిన సేవలను యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రజనీశ్‌ కర్ణాటక్‌ ప్రశంసించారు.

ఆంధ్రా బ్యాంక్‌ విశ్రాంత ఉద్యోగుల సమావేశం

హైదరాబాద్‌: ఆంధ్రాబ్యాంక్‌ విశ్రాంత ఉద్యోగులు సర్వీస్‌లో ఉన్న కాలంలో చేసిన సేవలను యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రజనీశ్‌ కర్ణాటక్‌ ప్రశంసించారు. వారిలో ప్రతి ఒక్కరూ ఇప్పటికి కూడా తమ సేవలను బ్యాంకుకు అందిస్తూ వ్యాపారం పెంచవచ్చునని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం జరిగిన ఆంధ్రా బ్యాంక్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల 11వ ద్వైవార్షిక సమావేశానికి ఆయన ఈ సందేశం పంపారు. ప్రస్తుతం పని చేస్తున్న వారిలో 10 శాతం మంది మాత్రమే పెన్షన్‌కు అర్హత కలిగి ఉన్నారని అఖిల భారత బ్యాంక్‌ రిటైరీల సమాఖ్య ప్రెసిడెంట్‌ ఎస్‌ఎం దేశ్‌పాండే చెబుతూ తమ పెన్షన్‌ అప్‌గ్రేడ్‌ చేయాలన్న రిటైర్డ్‌ ఉద్యోగుల డిమాండును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు గట్టిగా కృషి చేస్తున్నట్టు హామీ ఇచ్చారు. 

Updated Date - 2022-08-15T10:08:39+05:30 IST