Amaravathi: ఏపీ రాజధాని కోసం బీజేపీ పాదయాత్ర దేనికి సంకేతం?

ABN , First Publish Date - 2022-07-31T01:22:05+05:30 IST

ఏపీ (Ap) రాజధాని కోసం బీజేపీ (Bjp) నేతలు పాదయాత్ర చేస్తున్నారు. రాజధాని (Capital) పరిసర గ్రామాల్లో పర్యటిస్తూ ..

Amaravathi: ఏపీ రాజధాని కోసం బీజేపీ పాదయాత్ర దేనికి సంకేతం?

అమరావతి/హైదరాబాద్: ఏపీ (Ap) రాజధాని కోసం బీజేపీ (Bjp) నేతలు పాదయాత్ర చేస్తున్నారు. రాజధాని (Capital) పరిసర గ్రామాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రజలను పరామర్శిస్తున్నారు. రాజధాని ఉద్యమం ప్రారంభం అయి రెండున్నర ఏళ్లు దాటింది. ఇప్పుడు బీజేపీ నేతలు రాజధాని కోసం పాదయాత్ర చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ని రోజులు ఎందుకు పాదయాత్ర చేయలేదనే ప్రశ్నలు అమరావతి ప్రాంత వాసులు ప్రశ్నిస్తున్నారు. 


ఈ నేపథ్యంలో ‘‘ఏపీ రాజధాని కోసం బీజేపీ పాదయాత్ర దేనికి సంకేతం?. అమరావతి అగచాట్లు బీజేపీకి కొత్తగా కనిపిస్తున్నాయా?. ఉద్యమం వెయ్యి రోజులకు చేరుతుంటే కమలదళం ఇప్పుడెందుకు కదిలింది?. జగన్‎ (Jagan)ను భుజానమోస్తూ బీజేపీ చెప్పే మాటలకు విలువ ఉంటుందా?. కమలనాథులు తలుచుకుంటే అమరావతి నిర్మాణం ఆగేదా?. అంతేనా.. ఆఖర్లో వచ్చి మా వల్లే నిర్మాణమైందని చెప్పుకునే ఎత్తుగడ?.’’ అనే అంశాలపై  ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 




Updated Date - 2022-07-31T01:22:05+05:30 IST