రహానే వికెట్‌తో అరుదైన రికార్డు!

ABN , First Publish Date - 2021-03-06T11:05:44+05:30 IST

ఇంగ్లండ్ స్టార్ పేసర్ పేమ్స్ ఆండర్సన్ మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టే ఈ పేసర్.. అహ్మదాబాద్‌లో భారత్‌తో జరిగిన నాలుగో టెస్టులో అరుదైన ఘనత సాధించాడు.

రహానే వికెట్‌తో అరుదైన రికార్డు!

అహ్మదాబాద్: ఇంగ్లండ్ స్టార్ పేసర్ పేమ్స్ ఆండర్సన్ మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టే ఈ పేసర్.. అహ్మదాబాద్‌లో భారత్‌తో జరిగిన నాలుగో టెస్టులో అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్సు రెండో రోజు ఆటలో భారత బ్యాట్స్‌మెన్ అజింక్య రహానే వికెట్ కూల్చిన ఈ 38 ఏళ్ల పేసర్.. తన కెరీర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 900 వికెట్లు సాధించాడు.


ఈ రికార్డు సాధించిన తొలి ఇంగ్లండ్ బౌలర్ ఇతనే కావడం విశేషం. మొత్తం క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఆరో బౌలర్ ఆండర్సన్. ఇతని కన్నా ముందు ఆస్ట్రేలియా దిగ్గజాలు గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్, శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్, భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే, పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ వసీం అక్రమ్ ఈ అరుదైన రికార్డు నెలకొల్పారు.

Updated Date - 2021-03-06T11:05:44+05:30 IST