Jul 23 2021 @ 20:46PM

ఆలీ సినిమాకు సమంత అక్కినేని సపోర్ట్

ఆలీ, నరేశ్, పవ్రితా లోకేశ్‌ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘వికృతి’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఆలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఆలీ సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని మోహన్‌ కొణతాల, బాబా ఆలీ, శ్రీచరణ్‌లు సంయుక్తంగా నిర్మించారు. శ్రీపురం కిరణ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఎ.ఆర్‌.రహమాన్‌ వద్ద సంగీత శిక్షణ పొందిన రాకేశ్‌ పళిదం ఈ సినిమా ద్వారా సంగీత దర్శకునిగా మారారు. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలు మార్కెట్‌లోకి విడుదలై చక్కని విజయం దక్కించుకున్నాయి. మొదటి పాటను ప్రభాస్‌ విడుదల చేసి సినిమా పబ్లిసిటీని ప్రారంభిస్తే రెండో పాటను సోనూసూద్‌ విడుదల చేశారు. తాజాగా చిత్రంలో పతాక సన్నివేశంలో వచ్చే మూడో పాటను గ్లామరస్‌ క్వీస్‌ సమంత అక్కినేని విడుదల చేసి ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ టీమ్‌కి అభినందనలు తెలియచేశారు. 


ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ సినిమాలోని మూడో పాటను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఎంతో అభిమానించే ఆలీగారు ప్రొడక్షన్‌ చేస్తున్న మొదటి చిత్రమిది. నాకు ఇలాంటి రియల్‌ లైఫ్ స్టోరీలంటే చాలా ఇష్టం. ఇలాంటి సోల్‌ ఉన్న కథలను నేను చూస్తుంటాను. ఇట్స్‌ ఏ స్లైన్‌ ఆఫ్‌ లైఫ్, ఎందుకంటే రియలిస్టిక్, అండ్‌ రిలేటబుల్‌ స్టోరీ. అందుకే ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే ఆలీగారి మీద నమ్మకం ఉంది.. అన్నారు. పాట విడుదల చేసిన సమంతకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఆమె చేస్తున్న ‘శాకుంతలం’ చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లుగా ఆలీ తెలిపారు.