Jul 24 2021 @ 00:13AM

ఆలీ సక్సెస్‌ కొడతారు! సమంత

ఆలీ, వీకే నరేశ్‌, పవిత్రా లోకేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బావుండాలి. అందులో నేనుండాలి’. ఈ చిత్రంలోని మూడో పాటను కథానాయిక సమంత శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘నా ఫేవరెట్‌ ఆలీగారు తొలిసారి నిర్మిస్తున్న ‘అందరూ...’ చిత్రంలోని మూడో పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది. రియలిస్టిక్‌-రిలేటబుల్‌ స్టోరీతో రూపొందుతున్న. ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది. ఆలీగారు సక్సెస్‌ కొడతారనే నమ్మకం ఉంది’’ అని అన్నారు.  మలయాళ చిత్రం ‘వికృతి’కి ఇది తెలుగు రీమేక్‌. శ్రీపురం కిరణ్‌ దర్శకత్వంలో ఆలీవుడ్‌ ఎంటర్టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి రాకేశ్‌ పళిదం సంగీతం అందిస్తున్నారు.