Abn logo
Jun 19 2021 @ 21:49PM

అందని ‘చేయూత’

పొదలకూరు, జూన్‌ 19 :  మండలంలోని చాటగొట్ల గ్రామంలో అర్హులకు చేయూత పథకం అందలేదు. దీంతో బాధితులు ఎంపీడీవో ముందు  శనివారం తమ గోడును వెళ్లబోసుకున్నారు. చాటగొట్లకి చెందిన కె.మస్తానమ్మ, పి.పద్మ, కె.కృష్ణమ్మ, వి.పద్మ, బి.రాజేశ్వరి, ఎ.పెంచలమ్మ, జి.రమణమ్మ, ఏ.రాజేశ్వరి, ఒంటేరు సుందరమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మమ్మ, నాగతులసమ్మలతోపాటు పలువురు 15 మంది మహిళలు గ్రామానికి చెందిన వలంటీర్లు, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ సాయం అందకుండా చేశారని స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవోకి వినతిపత్రం అందించారు. ఈ విషయమై ఎంపీడీవో  మాట్లాడుతూ విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేస్తామని చెప్పారు. 

---------------------