పురాతన ఆలయాలను పరిరక్షించాలి

ABN , First Publish Date - 2021-10-27T07:14:55+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా పురాతన చారిత్రాత్మకత కలిగిన ఆలయాలను కొందరు కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రభుత్వం ఆలయాల పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని నగరంలోని పలు హిందూ సంస్థలు డిమాండ్‌ చేశాయి. మంగళవారం జిల్లాకేంద్రంలో ఆలయాల

పురాతన ఆలయాలను పరిరక్షించాలి
కలెక్టరేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న హిందూ సంస్థల నాయకులు

నిజామాబాద్‌ కల్చరల్‌, అక్టోబరు 26: రాష్ట్రవ్యాప్తంగా పురాతన చారిత్రాత్మకత కలిగిన ఆలయాలను కొందరు కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రభుత్వం ఆలయాల పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని నగరంలోని పలు హిందూ సంస్థలు డిమాండ్‌ చేశాయి. మంగళవారం జిల్లాకేంద్రంలో ఆలయాల పరిరక్షణ కోరుతూ హిందూ సంస్థలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ సందర్భంగా పూలాంగ్‌ చౌరస్తా నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆ తర్వాత వారు మాట్లాడుతూ బంగారు మైసమ్మ ఆలయాన్ని కూల్చడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, ఆలమ భూములను సైతం కబ్జా చేస్తున్నారని,  అందుకు కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో శివసేనా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీహరి, 48వ డివిజన్‌ కార్పొరేటర్‌ వనిత, శ్రీనివాస్‌, స్వామి, రాము, బీజేపీ  నాయకులు స్వామియాదవ్‌, న్యాయవాది రఘువీర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T07:14:55+05:30 IST