Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 29 2021 @ 15:51PM

BIGG BOSS 5లో తెలంగాణకు అన్యాయం.. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద యాంకర్ రవి అభిమానుల ఆందోళన

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5లో ఈ వారం యాంకర్ రవి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం రాత్రి రవి ఎలిమినేట్ అయిన విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఒక్కసారిగా అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని, బిగ్‌బాస్‌లో తెలంగాణ వారికి అన్యాయం జరిగిందని రవి అభిమానులు ఆరోపిస్తున్నారు.


గతవారం నామినేషన్స్‌లో రవి, సన్నీ, శ్రీరామ్, ప్రియాంక, షణ్ముఖ్, కాజల్, సిరి ఉన్నారు. వీరిలో సిరి, శ్రీరామ్, సన్నీ శనివారం ఎపిసోడ్‌లోనే సేవ్ అయ్యారు. ఆదివారం ఎపిసోడ్‌లో యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యారు. దీంతో రవి అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. రవి స్ట్రాంగ్ కంటెస్టంట్ అని, అతను ఎలిమినేట్ అవుతాడని తాము ఊహించలేదన్నారు. కాజల్ లేదా ప్రియాంక ఎలిమినేట్ అవ్వాలి కానీ, రవి ఎలిమినేట్ అవడం ఏంటి అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement