పోలీసులకు Anchor Ravi ఫిర్యాదు.. అసలేం జరిగింది..?

ABN , First Publish Date - 2021-12-16T15:00:10+05:30 IST

పోలీసులకు Anchor Ravi ఫిర్యాదు.. అసలేం జరిగింది..?

పోలీసులకు Anchor Ravi ఫిర్యాదు.. అసలేం జరిగింది..?

హైదరాబాద్ సిటీ/కూకట్‌పల్లి : సోషల్‌ మీడియాలో తనతోపాటు కుటుంబ సభ్యులపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని యాంకర్‌ రవి కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూసాపేటలోని రెయిన్‌బో విస్టాలో నివాసముండే రవిపై కొద్దిరోజులుగా కొందరు వ్యక్తులు యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టా గ్రామ్‌లో అసత్య ప్రచారంతోపాటు వ్యక్తిగతంగా తన పరువును దిగజార్చేలా పోస్టులు పెడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సింగ్‌రావు తెలిపారు.



Updated Date - 2021-12-16T15:00:10+05:30 IST