అంగన్‌వాడీ కేంద్రాల్లో నర్సరీ తరగతులా?

ABN , First Publish Date - 2022-06-09T15:15:38+05:30 IST

వసతులు లేని అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్‌కేజీ, యూకేజీ వంటి నర్సరీ తరగతులు నిర్వహిస్తామనే ప్రభుత్వ ప్రకటన హాస్యాస్పదంగా ఉందని పీఎంకే అధ్యక్షుడు

అంగన్‌వాడీ కేంద్రాల్లో నర్సరీ తరగతులా?

                                     - అన్బుమణి 


ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 8: వసతులు లేని అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్‌కేజీ, యూకేజీ వంటి నర్సరీ తరగతులు నిర్వహిస్తామనే ప్రభుత్వ ప్రకటన హాస్యాస్పదంగా ఉందని పీఎంకే అధ్యక్షుడు డా.అన్బుమణి రాందాస్‌ అన్నారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా గత అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ తరగతులు ప్రారంభించిందన్నారు. ఇందుకోసం సమీపంలోని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను బదిలీ చేశారన్నారు. ఈ తరగతులకు తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభించి, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారన్నారు. అలాంటి సమయంలో హఠాత్తుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రైవేటు పాఠశాలలకు లబ్ధి చేకూరుతుందన్నారు. వసతులు లేని అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ తరగతుల నిర్ణయాన్ని ఉపహసరించుకొని, ప్రభుత్వ పాఠశాలల్లోనే నిపుణులైన టీచర్లను నియమించి తరగతులు కొనసాగించాలని డా.అన్బుమణి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-06-09T15:15:38+05:30 IST