Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 30 Dec 2021 20:02:48 IST

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ‘అన్బరివు’.. ఎప్పుడంటే?

twitter-iconwatsapp-iconfb-icon
డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో అన్బరివు.. ఎప్పుడంటే?

హిప్‌ హాప్‌ తమిళ ఆది, శివాత్మిక రాజశేఖర్‌, కాశ్మీర జంటగా దర్శకుడు అశ్విన్‌ రామ్‌ తెరకెక్కించిన ‘అన్బరివు’ చిత్రం వచ్చే నెల 7వ తేదీ నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. సత్యజ్యోతి ఫిలిమ్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత టీజీ త్యాగరాజన్‌ సమర్పణలో సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇతర కీలక పాత్రల్లో సీనియర్‌ నటులు నెపోలియన్‌, సాయికుమార్‌, ఆషా శరత్‌తో పాటు విధార్థ్‌, దీనా, శరద్‌ రవి, వినోద్‌ సాగర్‌ తదితరులు నటించారు. అయితే, ఈ చిత్రం కోసం హీరో ఆది ఇద్దరు ప్రఖ్యాత సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. దీనిపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ‘అన్బరివు’ చిత్రంలోని రెండు పాటల్లో ఒక పాటను యువవ్‌ శంకర్‌ రాజా, మరో పాటను సంతోష్‌ నారాయణన్‌లు ఆలపించారు. ఈ పాటలకు సంబంధించి లిరికల్‌ ఆడియో ఇప్పటికే విడుదల కాగా, మంచి స్పందన వచ్చింది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement