అనంతపురం: 26 కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్

ABN , First Publish Date - 2021-01-16T13:25:26+05:30 IST

జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

అనంతపురం: 26 కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్

అనంతపురం: జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 26 కేంద్రాల్లో వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 35500 కోవిషీల్డ్ వ్యాక్సిన్లు జిల్లాకు చేరుకున్నాయి.  మొదటి విడతలో 30,747 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. గర్భిణి స్త్రీలు, 18 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న వారు వ్యాక్సిన్‌కు దూరంగా ఉండనున్నారు. ఉదయం 9 గంటలకు కువైట్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని  ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ సిరి ప్రారంభించనున్నారు. 

Updated Date - 2021-01-16T13:25:26+05:30 IST