Jul 9 2021 @ 09:05AM

'పుష్ప' సెట్‌లో అనసూయ..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ 'పుష్ప' సెట్‌లో క్రేజీ యాంకర్ కం నటి అనసూయ జాయిన్ అయినట్టు లేటెస్ట్ అప్‌డేట్. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఇందులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న అల్లు అర్జున్‌కి జంటగా నటిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పునఃప్రారంభమైంది. ఇందులో భాగంగా, తాజాగా 'పుష్ప' మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న అనసూయ గురువారం నుంచి షూటింగ్ కు హాజరైందని తెలుస్తోంది. 45 రోజుల లాంగ్ షెడ్యూల్‌తో చిత్రబృందం షూటింగ్‌కు ప్యాకప్ చెప్పనున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ - ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా రూ.250 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ మూవీ విడుదల కానుంది.