యాంకర్ అనసూయ ఇంట విషాదం

యాంకర్ అనసూయ ఇంట విషాదం నెలకొంది. ఆవిడ తండ్రి సుధాకర్ రావు ఖస్బా మృతి చెందారు.  ఆయన వయసు 63 సంవత్సరాలు. కొంతకాలంగా కేన్సర్ తో పోరాడుతున్న ఆయన తార్నాకలోని ఒక ఆసుపత్రిలో తుదిశ్వాసవిడిచారు. రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా ఉండే కాలంలో సుధాకర్ రావు యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్రటరీగా పనిచేశారు. ఆయనకి భార్య,  అనసూయ, వైష్ణవి కుమార్తెలు.  సుధాకర్ రావు మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.

Advertisement