రాష్ట్రంలో అరాచక పాలన: టీడీపీ

ABN , First Publish Date - 2021-01-23T06:48:26+05:30 IST

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ప్రతిపక్షాలపై అప్రకటిత ఎమర్జెన్సీని ప్రభుత్వం అమలుచేస్తోందని మాజీ మార్కెట్‌యార్డ్‌ చైర్మన కమతం కాటమయ్య విమర్శించారు.

రాష్ట్రంలో అరాచక పాలన: టీడీపీ
హిందూపురంలో నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు

ధర్మవరం, జనవరి 22: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ప్రతిపక్షాలపై అప్రకటిత ఎమర్జెన్సీని ప్రభుత్వం అమలుచేస్తోందని మాజీ మార్కెట్‌యార్డ్‌ చైర్మన కమతం కాటమయ్య విమర్శించారు. శుక్రవారం ధర్మపరిరక్షణ దీక్షలో భాగంగా పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట  నిరసన చే పట్టారు. ఈ సందర్భంగా కమతం కాటమయ్య మాట్లాడుతూ వ్యవస్థపై నమ్మకం కోల్పోయేలా అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి ప్రవర్తిస్తుండటం దారుణమన్నారు. ఎటువంటి మచ్చలేని నాయకుడు కళావెంకట్రావును అరెస్టుచేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో అన్ని మతాల, కులాల దేవుళ్లకు రక్షణ కరువైందన్నారు. ఆలయాలను, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా వారిని వదిలేసి టీడీపీ నాయకులను అరెస్టుచేయడం రాక్షసపాలనకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో బీసీ నాయకులను వైసీపీ టార్గెట్‌ చేసి బెదిరించడం, వినకపోతే అక్రమ కేసులు బనాయించడం జరు గుతోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు బోయరవిచంద్ర, పరిశేసుఽధాకర్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి పురుషోత్తంగౌడ్‌, శీలామూర్తి, రుద్రారవి, అం బటి సనతకుమార్‌, జమీర్‌అహమ్మద్‌, గరుగువెంగప్ప, పల్లపు రవీంద్ర, తోటవాసు, సత్యనారాయణచారీ, బాబ్జీ, సాకే పోతులయ్య, కుళ్లాయప్ప, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

  హిందూపురం టౌన: రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఆపాలని మతసామరస్యాన్ని కాపాడాలంటూ టీడీపీ నాయకులు శుక్రవారం డీటీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ వైసీపీ అధర్మపాలనపై ధర్మపరిరక్షణ నిరసన చేపడితే పోలీసులు అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇటీవల కాలంలో దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని అయితే దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్‌ చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం ఎంత వరకూ సమంజసమన్నారు. ఈ కార్యక్రమంలో అహుడా మాజీ చైర్మన అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కొల్లకుంట అంజినప్ప, రామాంజినమ్మ, షఫీ, పట్టణాధ్యక్షుడు రమేష్‌, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు ఆనంద్‌కుమార్‌, మాజీ జెడ్పీటీసీ ఆదినారాయణ, నాయకులు అమర్‌నాథ్‌, సు మో శీనా, బాచి, వెంకటస్వామి, సనావుల్లా, వెంకటరమణప్ప, శివప్ప, ముక్తియార్‌, నవీన, శ్రీనివాసరెడ్డి, సురేష్‌, న్యాయవాది శివశంకర్‌, విజయలక్ష్మీ, డైమెండ్‌బాబా, రాఘవేంద్ర, సురేంద్రయాదవ్‌, మోతుకపల్లి ఆనంద్‌, మురళీస్వామి, ముబారక్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-01-23T06:48:26+05:30 IST