Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 22 Oct 2021 21:33:00 IST

Aryan khan case : Ananya pandey కష్టాలు కంటిన్యూ... సోమవారం మళ్లీ...

twitter-iconwatsapp-iconfb-icon
Aryan khan case : Ananya pandey కష్టాలు కంటిన్యూ... సోమవారం మళ్లీ...

బాలీవుడ్ యంగ్ యాక్ట్రస్ అనన్య పాండే కష్టాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ వాట్సప్ చాట్స్‌లో ఆమె పేరు తలెత్తటంతో అనన్యకి ఎన్సీబీ సెగ మొదలైంది. ఆమె ఇంటిపై రైడ్ నిర్వహించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తనని గురువారం విచారణకు హాజరు అవ్వాలని అదేశించారు.


మొదటి రోజు 2 గంటల పాటూ ప్రశ్నించిన ఆఫీసర్స్ శుక్రవారం మరోసారి రావాల్సిందిగా అనన్యకి చెప్పారు. అయితే, ఈ రోజు 4 గంటల పాటూ ఆమెకు పలు ప్రశ్నలు సంధించారు ఎన్సీబీ వారు. అయినా అనన్య పాండేని మళ్లీ సోమవారం రావాలంటూ ఎన్సీబీ చీఫ్ సమీర్ వాంఖడే చెప్పటంతో, బీ-టౌన్‌లో ఆందోళన, అంతకంతకూ అధికం అవుతోంది. ఆర్యన్ ఖాన్, అనన్య పాండే తరువాత మరెవరి పేరైనా బయటకు వస్తుందేమోనని బాలీవుడ్ జనం కలవర పడుతున్నారు... 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...