అనంతపురం: జిల్లాలో మంత్రి ఉషశ్రీ (Minister Ushasri) అనుచరులు రెచ్చిపోయారు. కల్యాణదుర్గం (kalyandurgam) చెరువు కబ్జా చేసేందుకు యత్నించారు. పదుల సంఖ్యలో టిప్పర్లతో మట్టిని తీసుకెల్లి చెరువును పూడ్చేస్తున్నారు. దీంతో సమీప గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. టిప్పర్లపై దాడి చేశారు. సర్వే నెంబర్ 329లో 92.82 ఎకరాల్లో కల్యాణదుర్గం చెరువు ఉంది. వంద ఎకరాల చెరువు నీటితో రైతులు పంటల సాగు చేస్తున్నారు. కల్యాణదుర్గం చుట్టు పక్కల భూముల ధరలు పెరగడంతో చెరువుపై మంత్రి ఉషశ్రీ చరణ్ కన్నేశారు. చెరువును తన అనుచరులతో కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు.
అయితే మంత్రి కబ్జా ప్రయత్నాలను అడ్డుకునేందుకు రైతులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రైతులకు మద్దతుగా చెరువు దగ్గరకు కల్యాణదుర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు (Madhineni Umamaheswara Naidu) వెళ్లారు. అప్పటికే సగం చెరువును మట్టితో పూడ్చేశారు. దీంతో స్థానిక టీడీపీ (Tdp) నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రి ఉషశ్రీ అనుచరుల చర్యలను తప్పుబట్టారు.
ఇవి కూడా చదవండి