అనంతపురం జిల్లా ఆస్పత్రిలో ఎలుకలు..

ABN , First Publish Date - 2021-04-11T20:53:06+05:30 IST

అనంతపురం: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు కొత్త సంకటం వచ్చిపడింది. ఎక్కడపడితే అక్కడకు ఎలుకలు వచ్చి...

అనంతపురం జిల్లా ఆస్పత్రిలో ఎలుకలు..

అనంతపురం: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు కొత్త సంకటం వచ్చిపడింది. ఎక్కడపడితే అక్కడకు ఎలుకలు వచ్చి ఇక్కట్లు కలిగిస్తున్నాయి. ఆర్థో విభాగం ఆపరేషన్ థియేటర్‌లో విద్యుత్ బోర్డు ప్యూజ్‌లోకి వెళ్లిన ఎలుక షాక్‌తో చనిపోయింది. మమూలుగా రోజుకు పదుల సంఖ్యలో ఆర్థో విభాగం ఆపరేషన్ థియేటర్‌లో శస్త్ర చికిత్సలు జరుగుతాయి. అధునాతన యంత్రాలు ఏర్పాటు చేశారు. అలాంటి థియేటర్‌లో ఎలుకలు యధేచ్ఛగా తిరగడం ఆందోళన కలిగిస్తోంది. 


ఆరు నెలలుగా ఎలుకలు థియేటర్‌లోకి ప్రవేశించి విద్యుత్ వైర్లతోపాటు యంత్రాలకు సంబంధించిన వైర్లను కొరికేసాయి. దీంతో యంత్రాలు పనిచేయకుండా పోతున్నాయని ఆ విభాగానికి చెందిన డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఎలుకలు కారణంగా యంత్రాలు పనిచేయకుండాపోతే పరిస్థితి ఏంటని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలుకల వ్యవహారంపై అలజడి రేగడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు పరిస్థితిని సమీక్షించి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-04-11T20:53:06+05:30 IST