Abn logo
Aug 3 2020 @ 19:11PM

అనంతపురం వ్యవసాయ శాఖ జేడీ సస్పెండ్

అనంతపురం: జిల్లా వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషా సస్పెన్షన్‌కు గురయ్యారు. లైంగికంగా వేదిస్తున్నారంటూ మహిళా ఉద్యోగినులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డీఆర్‌డీఏ పీడీగా పని చేస్తున్న సమయంలోనూ గుంటూరులో మహిళా ఉద్యోగినులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటినీ పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు.. జేడీ హబీబ్ భాషాను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
Advertisement
Advertisement