Abn logo
Oct 17 2021 @ 15:30PM

ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డికి చేదు అనుభవం

అనంతపురం జిల్లా: గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. పామిడి పట్టణంలో రెండో విడత వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వెంకట్రామిరెడ్డిని స్థానిక మహిళలు నిలదీశారు. కాలనీలో నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ట్యాంకర్ల ద్వారా కూడా అధికారులు నీళ్లు ఇవ్వలేకపోయారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.