Abn logo
Nov 26 2021 @ 10:12AM

వైరల్ అవుతున్న అనంత ఆర్టీఏ అధికారుల చలాన్ల దందా

అనంతపురం : సామాజిక మాధ్యమాల్లో అనంత ఆర్టీఏ అధికారుల చలాన్ల దందా వైరల్ అవుతోంది. డ్రైవింగ్ లైసెన్స్ లేదంటూ బండి నాగలింగ అనే వ్యక్తికి అధికారులు రూ.ఐదు వేల ఫైన్ విధించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్స్యూరెన్స్, హెల్మెట్ లేదంటూ సుధాకర్ అనే ద్విచక్ర వాహన దారుడికి ఆర్టీఏ అధికారి వైవీ రెడ్డి రూ.8000 ఫైన్ వేశారు. ఆర్టీఏ అధికారుల తీరుపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.