అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-05-24T05:25:14+05:30 IST

దళిత యువకుడ్ని అన్యాయంగా హతమార్చిన రంపచోడవరం వైసీపీ నేత అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స డిమాండ్‌ చేశారు.

అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలి
అప్పలనర్స


ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్స డిమాండ్‌ 

పాడేరు, మే 23 (ఆంధ్రజ్యోతి): దళిత యువకుడ్ని అన్యాయంగా హతమార్చిన రంపచోడవరం వైసీపీ నేత అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ.. మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను తానే డ్రైవర్‌ హతమార్చానని అనంతబాబు అంగీకరించినందున అతడ్ని ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలన్నారు. ఇటు వంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా పరిణమిస్తారని, ఎమ్మెల్సీ గా కొనసాగే అర్హత ఆయనకు లేదన్నారు. అనంతబాబును అరెస్టు చేసిన పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు ప్రకటించలేదని, కచ్చితంగా ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అప్పలనర్స డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారం, మృతుని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, రెండెకరాల భూమి ఇవ్వాలని  అప్పలనర్స డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-05-24T05:25:14+05:30 IST