Abn logo
Sep 23 2021 @ 03:45AM

సీఎం సారూ.. ఏదీ పగటి విద్యుత్‌?

వైసీపీ మేనిఫెస్టోతో అనంతపురం రైతు వీడియో


రాయదుర్గం, సెప్టెంబరు 22: ‘‘వ్యవసాయానికి విద్యుత్‌ను నిరంతరాయంగా 9 గంటలపాటు, పగటిపూట ఇస్తామని వైసీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఆ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పగలు విద్యుత్‌ ఇస్తాడని ఆశించి నష్టపోయాం. ఇక్కడ మాకు మాత్రం రాత్రి వేళల్లోనే వ్యవసాయానికి విద్యుత్‌ అందిస్తున్నారు’’ అంటూ రైతు ఒకరు ఆరోపించారు. కుబేర... అనంతపురం జిల్లా డీ హీరేహాళ్‌ మండలం బాదనహాళ్‌ గ్రామానికి చెందిన రైతు. ఆయన తన పొలానికి రాత్రివేళలో నీరుపెడుతూ, రైతన్న ఆవేదనను ప్రస్తావిస్తూ చిత్రించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఎన్నికలకు ముందు జగన్‌ విడుదల చేసిన మేనిఫెస్టోను చూపుతూ, అందులోని హామీలను చదువుతూ ఆ వీడియో చిత్రీకరించారు. రాత్రిపూట పొలాలకు వెళ్లడానికి పడుతున్న ఇబ్బందులను వివరించాడు. ఎలుగుబంట్ల దాడితో రాత్రి వేళల్లో బిక్కుబిక్కుమంటూ పొలాలకు వెళ్లాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశాడు. పగటిపూట విద్యుత్‌ను అందిస్తే కొంత ఊరట ఉంటుందని పేర్కొన్నాడు. ఇచ్చిన హామీకి కట్టుబడి పగలు 9 గంటలపాటు విద్యుత్‌ అందించాలని ఆ రైతు విజ్ఞప్తి చేశాడు. 

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...