అనంతపురం జిల్లా: మహిళా వాలంటీర్ చేతివాటం

ABN , First Publish Date - 2021-08-22T21:51:35+05:30 IST

నేతన్న నేస్తం లబ్దిదారులకు కొందరు వాలంటీర్లు చుక్కలు చూపిస్తున్నారు.

అనంతపురం జిల్లా: మహిళా వాలంటీర్ చేతివాటం

అనంతపురం జిల్లా: ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న నేస్తం లబ్దిదారులకు కొందరు వాలంటీర్లు చుక్కలు చూపిస్తున్నారు. నేతన్న నేస్తం లబ్ది కావాలంటే చేయి తడపాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. రూ. 15వేల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలకు బలాన్నిచ్చే ఘటన ఒకటి అనంతపురం జిల్లాలో బయటపడింది. ధర్మవరం మున్సిపల్ పరిధిలో పనిచేసే సువర్ణ అనే మహిళా వాలంటీర్ చేతివాటం ప్రదర్శించింది. తనకు రూ. 2వేలు ఇస్తే నేతన్న నేస్తం పథకం వచ్చేలా చేస్తానని వాలంటీర్ చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రూ. 15 వందలు ఇస్తాను.. ఒప్పుకోమ్మా అంటూ వెంకటేష్ అనే లబ్ధిదారుడు వేడుకుంటున్న సంభాషణ కూడా వీడియోలో రికార్డయింది. 

Updated Date - 2021-08-22T21:51:35+05:30 IST