అనంతపురంలో కరోనా పాజిటివ్ రావడంతో వృద్ధురాలు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-08-05T21:56:41+05:30 IST

అనంతపురంలో కరోనా పాజిటివ్ రావడంతో వృద్ధురాలు ఆత్మహత్య

అనంతపురంలో కరోనా పాజిటివ్ రావడంతో వృద్ధురాలు ఆత్మహత్య

అనంతపురం: కమలపాడులో విషాదం చోటు చేసుకుంది. కమలపాడులో ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. వజ్రకరూరు మండలం కమలపాడు గ్రామంలో వృద్దురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 5 రోజుల క్రితం కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఒక్కరోజు మాత్రమే క్వారంటై న్ లో ఉంచుకుని హోం ఐసోలాషన్ లో ఉండాలంటూ వృద్ధురాలికి అధికారులు సూచించారు. దీంతో వృద్దురాలిని కుటుంబ సభ్యులు ప్రత్యేక గదిలో ఉంచారు. హోం ఐసోలాషన్ లో పట్టించుకునే వారు లేక వృద్ధురాలు తీవ్ర మనస్తాపం చెంది ఇంట్లోనే చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Updated Date - 2020-08-05T21:56:41+05:30 IST