Anantapuram: సూపర్ మార్కెట్‎లో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-09-02T13:12:05+05:30 IST

అనంతపురం జేఎన్‌టీయూ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ సూపర్ మార్కెట్‌లో షార్ట్ సర్క్యూట్‌ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో సూపర్ మార్కెట్‎లో

Anantapuram: సూపర్ మార్కెట్‎లో అగ్నిప్రమాదం

అనంతపురం: అనంతపురం జేఎన్‌టీయూ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ సూపర్ మార్కెట్‌లో షార్ట్ సర్క్యూట్‌ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో సూపర్ మార్కెట్‎లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మార్కెట్‎లో ఉన్న వస్తువులన్ని మంటల్లో దగ్ధం అయ్యాయి. పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

Updated Date - 2021-09-02T13:12:05+05:30 IST