అనంతలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ గృహ నిర్బంధం

ABN , First Publish Date - 2021-12-19T15:47:01+05:30 IST

కర్నూలు పర్యటనకు వెళుతున్న అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

అనంతలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ గృహ నిర్బంధం

అనంతపురం:  కర్నూలు పర్యటనకు వెళుతున్న అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్దకు టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. మరోవైపు మైనింగ్ అక్రమాలపై నిజ నిర్ధారణకు టీడీపీ బృందం సిద్ధమైంది. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు... టీడీపీ నేతలను ఎక్కడికక్కడ  గృహనిర్బంధం చేశారు. 

Updated Date - 2021-12-19T15:47:01+05:30 IST