అనంతపురం: అనంతపురం జిల్లాలోని కరువు పరిస్థితుల గురించి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలియదా.. అని మాజీ మంత్రి పరిటాల సునీత ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న కేసీఆర్‌కు.. ఇక్కడి సమస్యలు అన్నీ తెలుసని గుర్తుచేశారు. రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. రాయలసీమ బిడ్డగా చెప్పుకొనే సీఎం జగన్‌మోహన్ రెడ్డి.. రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని సునీత ప్రశ్నించారు.