Abn logo
Mar 2 2021 @ 07:40AM

అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి

అనంతపురం: అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుకొండ మండలం  కియా ఫ్యాక్టరీ సమీపంలో ఓ కారు(KA05, MA 6793)ను అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు కర్ణాటక వాసులుగా గుర్తించారు. వీరు బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తుండగా కియా ఫ్యాక్టరీ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులు కిషన్ గంజ్ నార్త్ ఢిల్లీకి చెందిన రేఖ(21), ఆంచల్ సింగ్(21), మహబూబ్ ఆలం(31), బెంగళూరు ఆర్‌టీనగర్‌కు చెందిన మనోజ్ మిట్టల్ (38)గా గుర్తించారు. మృతదేహాలను పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కుటుంబసభ్యులకు సమాచారం అందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
Advertisement
Advertisement