అనంతపురంలో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-03-05T16:54:22+05:30 IST

జిల్లాలోని టవర్ క్లాక్ సమీపంలోని మార్కెట్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

అనంతపురంలో అగ్నిప్రమాదం

అనంతపురం: జిల్లాలోని టవర్ క్లాక్ సమీపంలోని మార్కెట్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలకు పలు దుకాణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. షాపింగ్ కాంప్లెక్స్‌లో పలు బట్టల దుకాణాలు..చెప్పుల దుకాణాలు ఉన్నాయి. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న జనం బయటకు పరుగులు తీశారు. 

Updated Date - 2021-03-05T16:54:22+05:30 IST