Advertisement
Advertisement
Abn logo
Advertisement

టమాటా గిట్టుబాటు ధర లేక రోడ్డుపై పారబోసిన రైతులు

అనంతపురం జిల్లా: టమాట రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. వేలకు వేలు పెట్టుబడి పెట్టి.. ఇంటిల్లిపాది కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు పతనమైన ధరలు, మరోవైపు కొనేవారు లేక రైతులు టమాలను రోడ్డుపై పారబోశారు. అనంతపురం జిల్లా, ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో అత్యధికంగా టమాటా సాగవుతోంది. అనంతపురం, మదనపల్లి, ములకలచెరువు మార్కెట్లకు రోజుకు వంద టన్నులకుపైగా టమాటాలను రైతులు తీసుకువెళతారు. జులై, ఆగస్టు నెలల్లో 30 కిలోల బాక్స్ ధర రూ. 3వందలు పలుకగా.. ప్రస్తుతం రూ. 60కి పడిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. కనీసం రవాణా, కూలీ ఖర్చులు కూడా దక్కడంలేదు.

Advertisement
Advertisement