అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్య.. పట్టించుకోని ప్రభుత్వం..

ABN , First Publish Date - 2021-07-20T17:02:03+05:30 IST

అనంతపురం జిల్లాలో కొన్ని వందల గ్రామాలకు 10 రోజుల నుంచి మంచినీళ్లు సరఫరా కావడంలేదు.

అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్య.. పట్టించుకోని ప్రభుత్వం..

అనంతపురం: జిల్లాలో శ్రీ సాయి ట్రస్టు ద్వారా దాదాపు 500 గ్రామాలకు, రామిరెడ్డి ట్రస్టు ద్వారా 900 గ్రామాలకు మంచినీరు సరఫరా చేస్తుంటారు. అయితే గత 10 రోజులుగా ఆ గ్రామాలకు మంచినీరు రావడంలేదు. కారణం ఏంటంటే.. మంచినీళ్లు సరఫరా చేసే సిబ్బందికి ప్రభుత్వం జీతాలు ఇవ్వడంలేదు. చాలా కాలంగా జీతాలు ఇవ్వాలని అధికారులను అడిగి.. అడిగి.. అలసిపోయిన సిబ్బంది 10 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆయా గ్రామాలకు పూర్తిగా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. సమస్య పరిష్కారానికి అధికారులు ఏం చేస్తున్నారు? ఒక రోజు మంచినీళ్లు లేకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. అలాంటిది 10 రోజులుగా కొన్ని వందల గ్రామాలకు మంచినీళ్లు రాకపోతే అధికారులు, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదు? పూర్తి వివరాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి... 

Updated Date - 2021-07-20T17:02:03+05:30 IST