Advertisement
Advertisement
Abn logo
Advertisement

అనంతపురంలో సీపీఐ పాదయాత్ర

అనంతపురం: కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జిల్లాలో సీపీఐ  పాదయాత్ర చేటప్టింది.  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాదయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ప్యాక్టరీని ప్రైవేటుపరం చేస్తున్నారన్నారు. ఏపీలోని గంగవరం పోర్టును ఆదానికి ప్రధాని మోదీ అప్పజెప్పుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రధాని కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ఇవాళ రైతులకు వ్యతిరేకంగా మూడు దుష్ట చట్టాలను కేంద్రం తీసుకొచ్చిందని, వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ వ్యక్తులకు అప్పజెప్పేందు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వీటికి నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున పాదయాత్ర చేపడుతున్నామని తెలిపారు. 500 రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టే భారత్ బందుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని రామకృష్ణ పేర్కొన్నారు. 

Advertisement
Advertisement