అనంతపురం జనరల్‌ ఆసుపత్రిలో మృత్యుఘోష

ABN , First Publish Date - 2021-05-02T01:52:19+05:30 IST

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులతో పాటు మరణాలు కూడా అధికంగా నమోదవుతున్నాయి. అనంతపురం జనరల్‌

అనంతపురం జనరల్‌ ఆసుపత్రిలో మృత్యుఘోష

అనంతపురం: ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులతో పాటు మరణాలు కూడా అధికంగా నమోదవుతున్నాయి. అనంతపురం జనరల్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 10 మంది రోగుల మృతి చెందారు. దీంతో ఆస్పత్రిలో మృతుల బంధువుల ఆందోళనకు దిగారు. బాధితుల ఆందోళన నేపథ్యంలో ఆస్పత్రిలో జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ తనిఖీ చేశారు. రోగుల మరణాలపై వైద్యాధికారులను జాయింట్ కలెక్టర్ విచారిస్తున్నారు.


ఈ రోజే కర్నూలు కేఎస్‌ కే‌ర్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఆక్సిజన్ అందక ఆరుగురు కరోనా రోగులు మృతి చెందారు. తమకు ఆక్సిజన్ అందడం లేదని రోగులు ఎంత మొత్తుకున్నా ఆస్పత్రి సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు. అయితే కరోనా చికిత్సకు ఈ ఆస్పత్రి వైద్యులకు ఎలాంటి అనుమతులు లభించలేదు. అయినా సరే కరోనా చికిత్స చేస్తున్నారు. అయితే ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో వారు ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసులను చూడగానే ఆస్పత్రి సిబ్బంది పరారయ్యారు.

Updated Date - 2021-05-02T01:52:19+05:30 IST