అనంతపురం: జిల్లాలోని వెల్దుర్తి దగ్గర చిత్రావతి నదిలో చిక్కుకున్న కారు కొట్టుకుపోయింది. కాగా అందులో ఉన్న నలుగురిని సహాయ సిబ్బంది రక్షించింది. ఈరోజు ఉదయం చిత్రావతి నది దాటుతుండగా వరద ప్రవాహం ఉధృతికి కారు చిక్కుకుపోయింది. సమాచారం అందిన వెంటనే సహాయసిబ్బంది అక్కడకు చేరుకుని జేసీబీ సహాయంతో ఒడ్డుకు తీసుకువచ్చేందుకు యత్నించారు. అయితే నలుగురిని రక్షించిన తర్వాత కారు వరదలో కొట్టుకుపోయింది. దీంతో వరద ప్రవాహం మధ్యలో జేసీబీపైనే తొమ్మిది మంది చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు సహాయ బృందాల యత్నిస్తున్నాయి.