అనంతపురం: జిల్లాలోని రామగిరి మండలం ముత్యాలమ్మ దేవస్థానం వద్ద దళిత యువకుడు ముత్యాలపై దాడిని నిరసిస్తూ దళిత సంఘాల నేతల ఆందోళనకు దిగారు. దేవస్థానం వద్ద ముత్యాలపై ఆలయ నిర్వాహకులు దాడి చేశారు. ఈఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితుడి బంధువులు, దళితులను లోపలికి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. డీఎస్పీ వీరరాఘవరెడ్డితో దళిత సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు ఎస్పీ కార్యాలయంలోకి దళిత సంఘాల నేతలను పోలీసులు అనుమతించారు.
ఇవి కూడా చదవండి