తాడిపత్రిలో మరింత ముదురుతున్న స్టాచ్యూ ఫైట్

ABN , First Publish Date - 2022-02-18T17:30:32+05:30 IST

జిల్లాలోని తాడిపత్రిలో స్టాచ్యూ ఫైట్ మరింత ముదురుతోంది.

తాడిపత్రిలో మరింత ముదురుతున్న స్టాచ్యూ ఫైట్

అనంతపురం: జిల్లాలోని తాడిపత్రిలో స్టాచ్యూ ఫైట్ మరింత ముదురుతోంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి కేతిరెడ్డి రామిరెడ్డి విగ్రహాన్ని పెద్దారెడ్డి అనుచరులు ఆవిష్కరించారు. వైసీపీ కార్యకర్తలు  విగ్రహం ముసుగును తొలగించి పూలమాలలు వేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి కేతిరెడ్డి రామిరెడ్డి విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టారు. మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం లేకుండానే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ విషయాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్‌లు... కలెక్టర్ నాగలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. మరో వివాదానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి తెరలేపారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 

Updated Date - 2022-02-18T17:30:32+05:30 IST