కదిరిలో ఉపాధ్యాయురాలి హత్య కేసును చేధించిన పోలీసులు

ABN , First Publish Date - 2022-02-16T17:26:50+05:30 IST

కదిరిలో దొంగల చేతిలో దారుణ హత్యకు గురైన ఉపాధ్యాయురాలు ఉషారాణి హత్య కేసును పొలీసులు చేధించారు.

కదిరిలో ఉపాధ్యాయురాలి హత్య కేసును చేధించిన పోలీసులు

అనంతపురం: కదిరిలో దొంగల చేతిలో దారుణ హత్యకు గురైన ఉపాధ్యాయురాలు ఉషారాణి హత్య కేసును పొలీసులు చేధించారు. ఎనిమిది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఐదు రాష్ట్రాల్లో నిందితుడు అతడి కోసం గాలించిన పోలీసులు... ఎట్టకేలకు నిందితుడు షేక్ షఫీ ఉల్లాను అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 58 తులాల బంగారం, రూ.97 వేల నగదు, హత్యకు ఉపయోగించిన ఇనప రాడ్డు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దండుపాళ్యం మూవీ ప్రేరణతో హత్యలు చేసినట్లు ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. నిందితుడు, సభ్యులపై  కదిరి సబ్ డివిజన్ పరిధిలో మూడు కేసులు, కర్ణాటకలో ఏడు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. నిందితుడు షేక్ షఫీ ఉల్ల ఒంటరిగానే హత్యలో పాల్గొన్నాడని ఎస్పీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 15 వందల మంది పాత నేరస్తులను పోలీసులు విచారించారు. దాదాపు ఐదు వేల మంది ఫింగర్ ప్రింట్లను పరిశీలించడంతో పాటు, 500 సీసీ కెమెరాల పరిశీలించారు. 

Updated Date - 2022-02-16T17:26:50+05:30 IST