అనంతలో పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్ష

ABN , First Publish Date - 2022-02-07T17:57:37+05:30 IST

ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దును నిరసిస్తూ టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్షకు దిగారు. ఎమ్మార్మో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు.

అనంతలో పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్ష

అనంతపురం: ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దును నిరసిస్తూ టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్షకు దిగారు. ఎమ్మార్మో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు. జిల్లాల పునర్విభజన, ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు చేయడం ఆటవిక విధానంగా ఉందన్నారు. ఏసీ రూముల్లో కూర్చుని విజయవాడలో నిర్ణయం చేయడం సమంజసం కాదని అన్నారు. ప్రజలకు ఏది అనుకూలమో కూడా ఆలోచించాలని.. ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు వల్ల 8 మండలాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఎక్కడ కళ్యాణదుర్గం... ఎక్కడ రామగిరి కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్‌లో రామగిరి ఏ విధంగా కలుపుతారని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రెవెన్యూ డివిజన్‌లో మార్పు జరిగిందని పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యానించారు. 


దీక్షకు అడ్డంకులు...

అంతకు ముందు ఉదయం  ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకులు సృష్టించారు. ఎమ్మార్వో కార్యాలయం వద్ద వేసిన దీక్షా ప్రాంగణం టెంట్లను తొలగించారు. చిన్నపాటి వేదికను ఏర్పాటు చేసుకోవాలంటూ టీడీపీ నేతలకు పోలీసులు సూచించారు. 

Updated Date - 2022-02-07T17:57:37+05:30 IST