అనంతపురం: కోట్ల రూపాయలకు కుచ్చు టోపీ పెట్టిన ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ పద్మశ్రీని పోలీసులు అరెస్ట్ చేశారు. సిగ్మా సిక్స్ పేరుతో కదిరి చుట్టుపక్కల ప్రాంతంలో పద్మశ్రీ కోట్లు వసూలు చేసారని మహిళలు ఫిర్యాదు చేశారు. పెట్టుబడులు పెట్టండి లాభాలు తీసుకోండి అంటూ ప్రజల నుండి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పద్మశ్రీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి పద్మశ్రీతో పాటు రవీంద్ర అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి