AP: డోనేకల్లు దగ్గర గుంతలో పడిన కారు వెలికితీత

ABN , First Publish Date - 2021-12-30T13:51:09+05:30 IST

జిల్లాలోని విడపనకల్లు మండలం డోనేకల్లు దగ్గర నీటి గుంతలో పడిపోయిన కారును పోలీసులు వెలికితీశారు.

AP: డోనేకల్లు దగ్గర గుంతలో పడిన కారు వెలికితీత

అనంతపురం: జిల్లాలోని విడపనకల్లు మండలం డోనేకల్లు దగ్గర నీటి గుంతలో పడిపోయిన కారును పోలీసులు వెలికితీశారు. ఈ ప్రమాదంలో బళ్లారికి చెందిన అశ్వర్థ నారాయణ అనే వ్యక్తి మృతి చెందారు. గుంతకల్లు నుంచి బళ్లారి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వంతెన కోసం తీసిన గుంతలో  కారు పడిపోయింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు దాదాపు 10 గంటల పాటు శ్రమించి కారును వెలికితీశారు. 

Updated Date - 2021-12-30T13:51:09+05:30 IST