అనంతపురం: కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్ రావడంతో అనంత పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే జిల్లా రైల్వే స్టేషన్‌లో కర్ణాటక ఎక్స్‌ప్రెస్ ప్రతీ భోగిని రైల్వే మూడో పట్టణ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి అనుమానిత వస్తువులు, వ్యక్తులు లేకపోవడంతో పోలీసులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఫోన్‌కాల్ ఎక్కడ నుంచి వచ్చిందన్న దానిపై అనంత పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.