అనంతపురం: జిల్లాలోని హిందూపురం పట్టణం నింకంపల్లి చెందిన అఖిబ్ (28), తౌసిఫ్(30)అనే ఇద్దరు యువకులపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. రహమత్‌పూర్‌కు చెందిన యువకులు ఈ దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.